శ్రావణ మాసంలో వర్షపు నీటితో ఈ చిన్న పరిహారాలు చేయండి.. డబ్బు, ప్రశాంతత కోసం ఇలా చేస్తారట!

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. ప్రకృతి మొత్తం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. వర్షాలతో వాతావరణం చల్లగా మారుతుంది. ఎండిపోయిన నేలలు పచ్చగా మారతాయి. చెట్లు, మొక్కలు, పంట పొలాలు కళకళలాడుతాయి. మరోవైపు హిందూ సంప్రదాయాల్లో శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలలో శివారాధన, వ్రతాలు, పూజలు, దానధర్మాలు చేయడం ఆనవాయితీ. ఇదే సమయంలో వర్షపు నీటికి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నాయి. శుభ్రమైన వర్షపు నీటితో కొన్ని పరిహారాలు చేస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, ఆర్థిక...