మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం
మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి గోదాం మొత్తం వ్యాపించాయి.సుమారు రెండు గంటలుగా మంటలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దట్టమైన పొగలతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ప్రమాదానికి కారణం, ఆస్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.