రీల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు! యువతకు మోదీ వార్నింగ్

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ యువతకు కీలక సూచనలు చేశారు. జెన్‌జీ యువత రీల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావానికి లోనుకావద్దని సూచించారు. విజయానికి షార్ట్‌కట్స్ వెతకడం ప్రమాదకరమని, రైల్వే ట్రాక్ దాటడం వంటి షార్ట్‌కట్స్ జీవితానికే ముప్పుగా మారుతాయని హెచ్చరించారు. యువత తమ రోల్ మోడల్స్ ఆత్మకథలను చదివి వారి జీవిత ప్రయాణం నుంచి స్ఫూర్తి పొందాలని మోదీ సూచించారు.