PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:02 am Posted by : News Desk

ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో మూడు రోజుల్లో, ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డులు ఉండగా.. వాటి ద్వారా 3.43 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.