హైదరాబాద్: ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జరుపుల సాయికుమార్ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధికారుల వేధింపులు, అధిక పనిభారం కారణంగానే సాయికుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.