Breaking :మేడిగడ్డ కేసు’KCRకు మళ్లీ నోటీసులు

TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. భూపాలపల్లి జిల్లా కోర్టు కేసును విచారించి, తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. గతంలో నోటీసులు అందలేదని KCR, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించగా ఉపశమనం లభించింది. అయితే కేసు విచారణ కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడంతో.. మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.