PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 11:42 am Posted by : News Desk

పట్టాలపై ఆడుకుంటున్న చిన్నారి.. కాపాడబోయిన తల్లి.. ఇద్దరి ప్రాణాలు బలి

హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న రెండేళ్ల కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి.. రైలు ఢీకొనడంతో చిన్నారితో కలిసి మృతి చెందింది.

ఈ ఘటన ఫలక్‌నుమా–బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అనూష (23), ఆమె రెండేళ్ల కుమారుడు త్రినాథ్‌గా గుర్తించారు.

చిన్నారి రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో అతడిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రైలు ఢీకొనడంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.