ఆగస్టు 12న సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?

న్యూఢిల్లీ: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 13న తెల్లవారుజామున 1:29 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. దీంతో భారతదేశంలో సూతక కాలం వర్తించదని పండితులు చెబుతున్నారు. ఉత్తర రష్యా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుండగా.. యూరప్, ఉత్తర అమెరికా, వాయువ్య ఆఫ్రికాలో పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణ సమయంలో సంప్రదాయాలను పాటించే వారు జపం, మంత్రోచ్ఛారణ, దానం వంటి కార్యక్రమాలు...