శివుడి విగ్రహంపై నాగుపాము.. అరగంట పాటు అక్కడే!
జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ దశలో ఉన్న శివుడి భారీ విగ్రహంపైకి ఓ నాగుపాము ఎక్కి సుమారు అరగంట పాటు అక్కడే ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. జగిత్యాల మండలం మోరేపల్లి గ్రామంలో నూతనంగా శివాలయ నిర్మాణం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఓ నాగుపాము విగ్రహం వద్దకు చేరుకుంది. మొదట విగ్రహం చుట్టూ తిరిగిన పాము.. ఆ తర్వాత క్రమంగా శివుడి...