చంద్రుడిపై శాశ్వత మానవ స్థావరం.. ఇస్రోకు నాసా ఆహ్వానం
హైదరాబాద్: చంద్రుడిపై పరిశోధనలను మరింత విస్తరించే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2032 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ‘మూన్ బేస్ మిషన్’లో భాగస్వామ్యం కావాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను నాసా ఆహ్వానించినట్లు సమాచారం. బెంగళూరులో జరిగిన ఇండియా-యూఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారంపై కీలక చర్చలు జరిగాయి....