PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 1:02 pm Posted by : News Desk

పార్టీ మార్పుపై పోచారం కీలక వ్యాఖ్యల

పార్టీ మార్పుపై పోచారం కీలక వ్యాఖ్య

హైదరాబాద్: మంత్రి పదవి లేదా డబ్బుల కోసం తాను పార్టీ మారలేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేకపోయినా తప్పలేదన్నారు.

తాను జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని, కాంగ్రెస్‌ జెండా కాదని వ్యాఖ్యానించారు. పెండింగ్‌ బిల్లులను ఆరు నెలల్లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే పార్టీ మారిన తర్వాత సగం నిధులు మాత్రమే మంజూరయ్యాయని చెప్పారు. నిధుల కోసం అడిగేందుకు సీఎం, మంత్రులకు ఫోన్‌ చేస్తే వారు స్పందించడం లేదని పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు