హస్తకళాకారులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కలప, క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు
అమరావతి: రాష్ట్రంలోని సంప్రదాయ, వారసత్వ హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటిపై ఆధారపడిన కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో హస్తకళాకారులకు అవసరమైన ముడిసరకును అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించారు. ముడిసరకు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొయ్య బొమ్మలు, వీణలు తదితర సంప్రదాయ కళాఖండాల తయారీదారులకు నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కేవలం రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులను పరిగణనలోకి...