దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర జోగులాంబ గద్వాల, ఆగస్టు 11:
చదువును మధ్యలో ఆపేసిన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా తిరిగి విద్యనభ్యసించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో టాస్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సెస్సీ, ఇంటర్ ప్రవేశాల గోడపత్రికలను విడుదల చేశారు.
ఎస్సెస్సీలో ప్రవేశానికి ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు, ఇంటర్‌కు 15 ఏళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఎస్సెస్సీకి విద్యార్హత అవసరం లేదని, ఇంటర్‌కు పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఇతర బోర్డుల్లో ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. గరిష్ట వయోపరిమితి లేదన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 17లోగా, జరిమానాతో 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.