హైదరాబాద్‌లో కలకలం.. శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం

పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం.. తల్లిదండ్రుల ఫిర్యాదు హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేసిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అనారోగ్యంతో ఒకే రోజు వ్యవధిలో కవల పిల్లలను కోల్పోయిన కుటుంబానికి ఈ ఘటన మరో విషాదంగా మారింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు నెలల కవలల్లో ఒక చిన్నారిని పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే అనంతరం ఖననం చేసిన ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ ఖాళీ గుంత మాత్రమే కనిపించింది. చిన్నారి...