Viral : మొసలి ముందు కూర్చొని పూజలు.. బీచుపల్లి ఘాట్ వద్ద ఆశ్చర్యకర ఘటన

జోగులాంబ గద్వాల: కృష్ణా నది తీరంలోని బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన ఓ మొసలి ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం ఏమాత్రం భయపడకుండా మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు ఆసక్తిగా వీక్షించారు. మొసలి కూడా కొద్దిసేపు అక్కడే ఉండి అనంతరం నది వైపు వెళ్లిపోయినట్లు సమాచారం.