కర్రలతో దాడి.. బూట్లతో ముఖంపై తొక్కారు!
శ్రీచైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దాడి.. ర్యాగింగ్ ఆరోపణలు మేడ్చల్ మల్కాజ్‌గిరి: దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన అభిషేక్‌పై రాత్రి సమయంలో సుమారు 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసి.. బూట్లతో ముఖంపై తొక్కినట్లు అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెట్లపై నుంచి కిందపడటంతో గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం తమకు ఫోన్‌లో సమాచారం...