PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:22 am Posted by : News Desk

జలపాతంతో శివుడికి నిత్య జలాభిషేకం.. బాహుబలి సీన్‌ను తలపిస్తున్న అద్భుత దృశ్యం!

మనాలి: హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ అంజనీ మహాదేవ్ ఆలయం ప్రకృతి అందాలతో భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆలయంలోని శివలింగంపై కొండపై నుంచి జలపాతం నిరంతరం పడుతూ నిత్య జలాభిషేకం చేస్తున్న అద్భుత దృశ్యం కనిపిస్తోంది.

ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య జలపాతం నుంచి శివలింగంపై నీరు పడుతున్న దృశ్యం చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన పలువురు ‘బాహుబలి’ సినిమాలోని సన్నివేశాలను తలపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అంజనీ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.