బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు వర్షాలు!
హైదరాబాద్: వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలికను బట్టి వర్షాల తీవ్రత, ప్రభావిత ప్రాంతాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం...