తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభలో కీలక తీర్మానం.. రెండేళ్ల పండుగల తేదీలపై ఏకాభిప్రాయం
హైదరాబాద్: హిందూ పండుగలు, పర్వదినాల తేదీల విషయంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి పరిష్కారం చూపే దిశగా తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28, 2028-29 సంవత్సరాలకు సంబంధించిన పండుగల తేదీలను దృక్ సిద్ధాంతం, శాస్త్రీయ గణనల ఆధారంగా పరిశీలించిన పంచాంగ కర్తలు.. పండుగల నిర్ణయాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణ అర్చక సమాఖ్య, భాగ్యనగర అర్చక పురోహిత సంఘం, భారతీయ తెలుగు దృగ్గణిత పంచాంగ కర్తల సమాఖ్య సేవా సంఘం, శ్రీ చండీ పరమేశ్వరి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో...