తెలంగాణ ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు.. ప్రజాపల్స్‌ కుటుంబం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల పండుగను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. ఆలయాలు పూల అలంకరణలు, బోనాల ఊరేగింపులు, భక్తుల సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. ఈ పవిత్రమైన ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా ప్రజాపల్స్‌ విలేకరులు, పాఠకులు, వీక్షకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రజాపల్స్‌ కుటుంబం ఆకాంక్షిస్తోంది....