UPI యూజర్లకు భారీ ఊరట.. పేమెంట్స్‌పై ఛార్జీలు ఉండవంటూ కేంద్రం క్లారిటీ!

UPI పేమెంట్స్‌పై ఛార్జీలు విధించనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే సాధారణ యూజర్లపై ఎలాంటి ఛార్జీల భారం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో కోట్లాది మంది UPI వినియోగదారులకు ఊరట లభించింది. ఇటీవల యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఛార్జీలు వసూలు చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా UPI పేమెంట్స్‌పై అదనపు ఛార్జీలు విధిస్తారనే ప్రచారంతో యూజర్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించి యూజర్లపై...