Viral : 8 అడుగుల జుట్టు.. భారతీయ యూట్యూబర్‌ వరల్డ్ రికార్డు

భారతదేశానికి చెందిన రేణు ధరియాల్ అరుదైన ఘనత సాధించారు. 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10 అంగుళాలు) పొడవైన జుట్టుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏప్రిల్‌లో ఈ రికార్డును ధృవీకరించారు. రేణు ధరియాల్ 2015 నుంచి జుట్టును కత్తిరించకుండా పెంచుకుంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతిలో పొడవైన జుట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అది అందం, సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారని ఆమె పేర్కొన్నారు. పట్టుదల,...