చెప్పులు ధరించి అమ్మవారి బోనం ఎత్తుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. సోషల్ మీడియాలో చర్చ
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో చెప్పులు ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు ప్రశ్నలు, విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో ఆయన కాళ్లకు చెప్పులు ధరించి బోనం ఎత్తుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించడం తెలంగాణలో ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. భక్తులు ప్రత్యేకంగా...