గురు పౌర్ణమి.. గురువుకు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజు
గురు పౌర్ణమి.. భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టమైన పర్వదినం. మన జీవితానికి జ్ఞానాన్ని అందించి, సరైన మార్గంలో నడిపించే గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగువైపు నడిపించే వ్యక్తే గురువు. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే తొలగించేవాడు అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కేవలం విద్యను బోధించడమే...