బడంగ్‌పేటలో బిల్లుల బాగోతంపై ఆరా!
250 ఫైళ్లపై అధికారుల నజర్.. స్థలాలు చూపిస్తేనే చెల్లింపులు! రూ.5 లక్షల లోపు పనులపైనా ప్రత్యేక తనిఖీలు | 610 ఫైళ్లలో 360 పరిశీలన పూర్తి | మిగిలిన ఫైళ్ల వివరాలపై కొనసాగుతున్న ఆరా బడంగ్‌పేట: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల పేరుతో ఖర్చు చేసే ప్రజాధనం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. బడంగ్‌పేట మున్సిపాలిటీలో పాత పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పరిశీలన ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో నిధుల దుర్వినియోగం, పనుల కేటాయింపులపై వచ్చిన ఆరోపణలు,...