అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం, కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని ఉపనిషత్తులు ఉద్ఘాటించాయి. జీవకోటికి ప్రాణాధారమైన అన్నాన్ని ప్రసాదించే సాక్షాత్తు దేవతగా అన్నపూర్ణాదేవిని భక్తులు ఆరాధిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారు తన వామ హస్తంలో అమృతాన్నంతో నిండిన బంగారు పాత్రను, కుడి చేతిలో రత్నాలు పొదిగిన గరిటెను ధరించి, ఆదిదేవుడైన పరమేశ్వరుడికి...