జర్మనీలో వింత కేసు.. యువతిని వేధించిన రోబో!
జర్మనీలో ఓ వింత, దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఓ రోబో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యువకులపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, రోబోను స్వాధీనం చేసుకున్నారు. కొలోన్ నగరంలోని హోహెన్జోలెర్న్రింగ్ వీధిలో ఆదివారం రాత్రి 11:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బయట...