PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:49 am Posted by : News Desk

శ్రీవారి దర్శనానికి భక్తుల క్యూ.. 15 గంటల పాటు నిరీక్షణ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు బయట ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

టోకెన్ లేకుండా సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు 15 గంటల సమయం పడుతోంది. దీంతో తిరుమలలోని క్యూ లైన్లలో భక్తుల రద్దీ కనిపిస్తోంది.

మరోవైపు గురువారం మొత్తం 68,771 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.6.94 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.