మీసాలతో దర్శనమిచ్చే కృష్ణుడు.. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఎక్కడంటే?

శ్రీకృష్ణుడు అనగానే మనకు నెమలి పింఛం, చేతిలో వేణువు, ముఖంపై చిరునవ్వుతో కూడిన దివ్యరూపం గుర్తుకొస్తుంది. అయితే తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో మాత్రం కృష్ణుడు అందుకు భిన్నమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ముఖంపై కోరమీసాలతో కొలువుదీరిన ఈ స్వామివారిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా తరలివస్తుంటారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఇక్కడి శ్రీకృష్ణుడిని భక్తులు ప్రేమగా ‘మీసాల కృష్ణుడు’, ‘మీసాల వేణుగోపాలస్వామి’ అని పిలుచుకుంటారు. సాధారణంగా వేణుగోపాలుడి విగ్రహాలు ప్రశాంతమైన ముఖకవళికలతో, చేతిలో వేణువుతో కనిపిస్తాయి....