మేడ్చల్ హౌసింగ్ బోర్డ్–లైబ్రరీ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు.. బీజేపీ పోరాటానికి ఫలితం: నాయకులు
మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గిర్మాపూర్ బీజేపీ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం కోసం అనేకసార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ధర్నాలు, నిరసనలు నిర్వహించి ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పలుమార్లు అధికారులతో మాట్లాడి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఏప్రిల్ 13న ప్రజావాణి కార్యక్రమంలో...