TG: లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. తనను ఉదయ్‌కృష్ణారెడ్డి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా, తాజాగా ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్‌కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.