ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన డెలివరీ బాయ్.. వైరల్‌గా మారిన సీసీటీవీ వీడియో

డెలివరీ సిబ్బంది భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఇటీవల జరిగిన షాకింగ్ ఘటన మరువకముందే, మరో డెలివరీ బాయ్ ఓ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఈ నెల 16న ఓ డెలివరీ బాయ్ పార్సెల్ అందించేందుకు ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో యువతి ఒంటరిగా ఉందని భావించి, తలుపును నెట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో యువతి తల్లి...